CM Chandrababu at Independence Day Celebrations: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి చంద్రబాబు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించినట్లయిందని చంద్రబాబు పేర్కొన్నారు.