AP MINISTERS ON JOGI RAJEEV ARREST: అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసినట్లు ఆధారాలున్నందునే జోగి రమేష్ కుమారుడ్ని అరెస్టు చేశారని మంత్రులు, టీడీపీ నేతలు వెల్లడించారు. మాజీమంత్రి జోగి రమేష్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసు విచారణలో రాజకీయ జోక్యం లేదని, పూర్తిగా చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.