Minister Uttam on Sitarama Project : ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు 3 పంపులను ప్రారంభిస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు రూ.7,436 కోట్లు ఖర్చు చేసి, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నీటి పారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జలసౌధలో మంత్రి పొంగులేటితో పాటు ఉత్తమ్‌కుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.