Organic Farming in Nalgonda : చిన్నప్పటి నుంచి ప్రకృతి ఒడిలో పెరిగాడా యువకుడు. ప్రకృతిని మనం సంరక్షిస్తే, అది మనల్ని కాపాడుతుందని విశ్వసించాడు. అందుకోసం సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించాడు. ప్లాస్టిక్ భూతమే ప్రకృతి వినాశనానికి కారణమని భావించి, దాని నిర్మూలనకు నడుం బిగించాడు. వందలాది మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నాడు. అంతేకాదు, తను చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, పర్యావరణ పరిరక్షకుల మన్ననలు పొందుతున్నాడు. మరి, ఆ ప్రకృతి ప్రేమికుడి కథేంటో మనమూ చూద్దామా!