HYDRA Project Responsibilities : రాష్ట్ర రాజధానిలో నీటి వనరులను పరిరక్షించుకోకపోతే హైదరాబాద్ మహానగరం భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హైడ్రా వెల్లడించింది. ఇప్పటికే నగరవ్యాప్తంగా 61 శాతం మేర నీటి వనరులు కుంచించుకుపోయినట్లు గుర్తించిన హైడ్రా, మూడు దశల్లో చెరువులకు పునరుజ్జీవం పోసేందుకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను క్రమంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. పేదలను అడ్డుపెట్టుకొని కొంతమంది చెరువుల భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్న రంగనాథ్, వారందరికీ హైడ్రా అడ్డుకట్ట వేస్తుందన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై కూడా విజిలెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.