CM Chandrababu at International Tribal Day Celebrations: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం వేళ రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలల్లో ఒకటని గుర్తు చేశారు. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవానికి హాజరైన సీఎం గిరిజనులతో మమేకమయ్యారు.