Telangana Govt On Bhudhar : రాష్ట్రంలో మరోమారు అధికార యంత్రాంగం భూదస్త్రాల ప్రక్షాళన చేపట్టనుంది. ప్రతి కమతానికి ‘భూధార్’ సంఖ్యను కేటాయించేందుకు దస్త్రాల పరిశీలన తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో కొత్త ఆర్ఓఆర్-2024 చట్టం తెచ్చేందుకు ఇటీవలే రెవెన్యూశాఖ కార్యాచరణ ప్రారంభించి ముసాయిదా విడుదలచేసింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకురానున్నారు.