¡Sorpréndeme!

సైబర్‌ దోపిడీ రోజుకు రూ.86 లక్షలు

2024-08-07 4 Dailymotion

Cyber ​​Frauds in AP : సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. కంటికి కనిపించకుండా సగటున రోజుకు రూ.86 లక్షల సొత్తు దోచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో మోసాలకు తెగబడుతూ వందల కోట్లు కొల్లగొడుతున్నారు. 2021 జులై నుంచి 2024 జులై వరకు మూడేళ్ల వ్యవధిలో సైబర్‌ నేరగాళ్ల బారిన పడి ఏపీలోని బాధితులు ఏకంగా రూ.940 కోట్లు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ గణాంకాల్లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.