¡Sorpréndeme!

లావణ్య చేసింది ఆరోపణలు మాత్రమే - నా దగ్గర ఆధారాలున్నాయి లీగల్​గా వెళ్తా : రాజ్​ తరుణ్

2024-07-31 350 Dailymotion

Hero Raj Tarun Reaction on Lavanya Allegations : లావణ్యతో వివాదం తననే కాదు తన కుటుంబాన్ని కూడా తీవ్రంగా బాధించిందని యువ కథానాయకుడు రాజ్ తరుణ్ అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న లావణ్యపై న్యాయపోరాటం చేస్తానని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. లావణ్య ఆరోపణల్లో నిజం లేదని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. తన తాజా చిత్రం 'తిరగబడరా స్వామి' చిత్రం ఆగస్టు 2న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్​ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​కు మాల్వీ మల్హోత్రాతో కలిసి రాజ్ తరుణ్ హాజరయ్యారు.