CM Revanth Reddy Comments On Sabitha Indra Reddy : రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ వ్యవహారం సభలో కాకరేపింది. అధికార ప్రతిపక్ష నేతలు పార్టీ ఫిరాయింపులపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార పక్షం వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.