¡Sorpréndeme!

'మీ పిల్లలు ఫలానా కేసులో ఇరుక్కున్నారంటూ' కాల్స్​ వస్తున్నాయా? - అయితే జాగ్రత్త పడాల్సిందే!

2024-07-30 53 Dailymotion

Cyber Crime in Nizamabad : కొత్త పంథాలతో సైబర్ నేరాలకు తెరలేపారు నేరగాళ్లు. ఈ నేరాల పట్ల అవగాహన పెరిగినందున రోజుకో మార్గంలో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్​ ఉన్నతాధికారుల పేరిట వాట్సాప్​ క్రియేట్​ చేసి, ప్రజలకు కాల్స్​ చేసి ఫలనా మీ అబ్బాయి, అమ్మాయి ఫలానా కేసులో ఇరుక్కుందంటూ చెప్పి డబ్బులు లాగుతున్నారు. పోలీస్​ అధికారుల ఫొటోతో కాల్​ రావడంతో ఆందోళనకు గురువుతున్న కొంతమంది డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకతనికి ఎదురైంది. దీంతో నిందితులకు ప్రశ్నల వర్షం కురిపించగా ఏకంగా కాల్​ కట్ చేశారు.