BJP Protest In Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు సమన్యాయం పాటించలేదని, మహిళలకు నిధులు కేటాయించలేదని, అది రాజకీయ ప్రసంగంలాగా ఉందని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.