¡Sorpréndeme!

ప్రజల ఆలోచనలు వినడం మా ప్రభుత్వ విధానం : రేవంత్

2024-07-26 131 Dailymotion

Telangana Fire department passing out parade in Hyderabad : తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే అత్యంత కీలకమైన విషయమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. హైదరాబాద్​లోని వట్టినాగుపల్లిలో అగ్ని మాపక శాఖ పాసింగ్​ అవుట్​ పరేడ్​కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి విచ్చేశారు. ఈ పాసింగ్​ అవుట్​ పరేడ్​ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాసింగ్​ అవుట్​ పరేడ్​లో 483 మంది శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​ బాబు, ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.