BRS Leaders Visit Medigadda Project : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గోదావరి నదిని ఆ బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కేటీఆర్ బృందానికి స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దర్శనం అనంతరం కన్నెపల్లికి పంపుహౌజ్ను పరిశీలిస్తున్నారు. చివరిగా మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లనున్నారు.