Telangana Assembly Sessions 2024 : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశంపై వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. రాష్ట్రంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ చర్చ కొనసాగింది. ఈ చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.