Harish Rao Speech in Assembly Media Point : నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని, ఇదేమని అడిగితే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. విరామ సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్లో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండి పడ్డారు. అధికారంలోకి రాకముందు గ్రూప్1, గ్రూప్2 పోస్టులను పెంచుతామని, ఇప్పుడు సాధ్యం కాదనడం సమంజసం కాదన్నారు.