Special Financial Assistance to AP in Union Budget 2024: కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరి పీల్చుకున్న రాజధాని అమరావతి ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఆర్థికసాయంతో పరుగులు పెట్టనుంది. ఈ ఏడాది రూ.15 వేల కోట్లు సమకూర్చనుండటంతో నిర్మాణ పనులు శరవేగంగా సాగనున్నాయి. గత ఐదేళ్లలో కుదేలైన అమరావతికి ఏడాది కాలంలోనే ఓ రూపురానుంది. అమరావతికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపపై రాజధాని రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.