¡Sorpréndeme!

రాష్ట్రంలో ఏకధాటిగా వర్షాలు - పంటలు సాగు చేస్తున్న

2024-07-22 29 Dailymotion

Farmers Rainy Season Crops : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలుమరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వారం రోజులుగా దండిగా వర్షాలు పడుతుండడంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇది ఇలా ఉండగా సర్కార్‌ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడంతో అన్నదాతులు సంతోషంలో మునిగారు. వానా కాలం సంబంధించి కోటీ 29 లక్షల 32 వేల 310 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వం నిర్థేశించగా 60 లక్షల 42 వేల 669 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం 46.73 శాతం ఆయకట్టు సాగులోకి వచ్చినట్లైంది.