KTR and BRS Leaders Met Governor CP Radhakrishnan : రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అడుగడుగునా తుంగలో తొక్కుతోందంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కె. తారకరామారావు ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.