Gopanpally Flyover Inaugurate : రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులను గట్టెక్కించేందుకు నిర్మించిన పైవంతెనలు దాదాపుగా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా నగర శివారు ఐటీ కారిడార్‌లోని గోపన్‌పల్లితండా వంతెనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. "వై" ఆకారంలో నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి వస్తే గచ్చిబౌలికి వెళ్లే ఐటీ ఉద్యోగులతోపాటు గోపన్‌పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల, కొల్లూరు వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.