Rottela Panduga Celebrations Second Day : బారాషాహీద్ రొట్టెల పండుగకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఐదురోజులపాటు జరుపుకునే ఈ పండుగకు పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు రెండో రోజు కాగా బారాషాహీద్ దర్గాలో సందడి నెలకొంది.