Telangana Crop Loan Waiver : తెలంగాణలో నేటీ నుంచి రైతుల పంట రుణమాఫీ మొదలు కానుంది. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో 7వేల కోట్ల రూపాయలు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణ బకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది. రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.