Irregularities in Swapnalok Layout Vizianagaram District : విశాఖ -అరకు మధ్యలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షల్లో పలికిన ఎకరం ధర ఒక్కసారిగా కోట్లకు చేరింది. వాటిపై కన్నేసిన వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు అక్కడ గద్దల్లా వాలిపోయారు. వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వేసి అక్రమాలకు తెరలేపారు. కనీస నిబంధనలు పాటించకపోగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. సాగునీటి వనరులనూ కప్పేశారు. విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల అక్రమ లేఅవుట్‌లపై ప్రత్యేక కథనం.