Lack of Staff in APSRTC: ఆర్టీసీ కండక్టర్ అంటే ప్రయాణికులకు టికెట్లు జారీ చేయాలి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం వారికి బస్టాండ్ల వద్ద కాపలా డ్యూటీ వేసింది. ఆర్టీసీకి సేవలందించాల్సిన సీనియర్లు వైఎస్సార్సీపీ భక్త అధికారుల అనాలోచిత నిర్ణయాలతో బస్టాండ్ల వద్ద మండుటెండలో చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఒకపక్క సిబ్బంది కొరతతో ప్రయాణికులు అవస్థలు పడుతుంటే ఉన్నవారిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.