KU Students Protest about Hostel Incident : కాకతీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు అక్కడి విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వసతిగృహంలో స్లాబ్ పెచ్చులూడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని ఘోరావ్ చేసిన ఆందోళనకారులు, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్ధులను వేరే వసతి గృహానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు.