¡Sorpréndeme!

వానాకాలం 'కరెంట్ కట్​'లపై విద్యుత్ శాఖ ఫోకస్ - కంప్లైంట్​లు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌

2024-07-13 753 Dailymotion

Telangana Electricity Dept Focus on Call Center : మారుతున్న కాలంతో పాటు విద్యుత్ శాఖ నూతన సాంకేతికతతో వినియోగదారులకు సేవలందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు బిల్లింగ్, విద్యుత్ కోత వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే యాప్, వెబ్‌సైట్ ద్వారా బిల్లుల చెల్లింపు విధానాన్ని సులభతరం చేసిన విద్యుత్ శాఖ, సరఫరా అంతరాయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ ఏర్పాటు చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తోంది.