BRS Leaders Joining congress ప్రజాప్రతినిధులు పార్టీని వీడకుండా చూడడంలో భారాస ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒక్కొక్కరుగా శాసనసభ్యులు పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. ఇప్పటివరకు పార్టీని వదిలిపెట్టిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరగా ఆరుగురు ఎమ్మెల్సీలు అదే బాట పట్టారు. మరికొంత మంది గులాబీ కండువాను పక్కకు పెట్టి హస్తం గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.