¡Sorpréndeme!

అర్హులకే రైతు భరోసా : మంత్రవర్గ ఉపసంఘం

2024-07-10 239 Dailymotion

Rythu Bharosa Workshop in Khammam District : రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, ఇతర అన్ని వర్గాల సలహాలు, సూచనలు రైతు భరోసా పథకం అమలుపై స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా తొలి కార్యశాల నిర్వహించింది. విధివిధానాల అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్​, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్​లో అభిప్రాయాలు సేకరించారు.

ఈ సమావేశంలో మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 500 మంది రైతులు హాజరయ్యారు. రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన బాధ్యులు హాజరయ్యారు.