Manikonda Cave Pub Drugs Case : మణికొండ కేవ్ పబ్బులో సోదాలు నిర్వహించి మాదకద్రవ్యాలు తీసుకున్న 24 మందిని, అరెస్టు చేశామని మదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మత్తుపదార్ధాలు సేకరించిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమంలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారని, సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్, సైబరాబాద్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు సోదాలు చేశామన్నారు.