GHMC Council Meeting started : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ ప్రారంభం కాగా, మేయర్, డిప్యూటీ మేయర్లు ఇద్దరూ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని నినాదాలు చేశారు. దీంతో సమావేశాలు 15 నిమిషాలు వాయిదా పడ్డాయి.