CM Chandrababu And Revanth Meet : తెలంగాణ ఆస్తుల విషయంలో రాజీ పడొద్దని, రేపటి సీఎంల భేటీలో అన్ని విషయాలపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందన్న ఆయన, కేంద్రంపై సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి తీసుకొచ్చి సీట్లు పెరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.