¡Sorpréndeme!

7 తరగతులు 100 మంది విద్యార్థులు ఒక్కరే టీచర్

2024-07-04 416 Dailymotion

Govt School with Only One Teacher for Seven Classes in Wanaparthy : ఉపాధ్యాయుల బదిలీలు హేతుబద్దంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది మంది విద్యార్థులున్న పాఠశాలకు సైతం ఇద్దరు టీచర్లను ఉండాలని సూచించింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నమైన స్థితి నెలకొంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ మొత్తం 100 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలున్నారు. గతంలో అక్కడ ఓ హిందీ పండిట్, ఓ స్కూల్ అసిస్టెంట్, నలుగురు ఎస్​జీటీలు పనిచేసే వాళ్లు. స్కూల్ అసిస్టెంట్ పదవీ విరమణ పొందగా, హిందీ పండిట్‌ను డిప్యుటేషన్‌పై మరో స్కూలుకు పంపించారు. మిగిలిన నలుగురు ఎస్​జీటీలే ఏడు తరగతుల్ని నెట్టుకొచ్చే వాళ్లు. తాజాగా ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే మిగిలారు. ఒక్క టీచరే ఏడు తరగతులకు బోధించాల్సి వస్తోంది.