Telangana Cabinet Expansion 2024 : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. సామాజిక సమీకరణాల ఆధారంగా చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అధిష్ఠానంతో చర్చించి తుదిరూపు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర ముఖ్యనేతలు, ఇవాళ లేదా రేపు దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడున్న అమాత్యుల శాఖల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.