Diarrhea in Joint Anantapur Dist : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాపాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను ఐదేళ్లలో నిర్వీర్యం చేయడం ప్రజారోగ్యానికి శాపంగా పరిణమించింది. అనంత పల్లెల్లో వాంతులు, విరేచనాలతో అనేక మంది అవస్థలు పడుతున్నారు. దీంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీస్తున్నారు.