35Kgs Ganja Seized at Karimnagar Hyderabad Highway : సినీఫక్కీలో పళ్ల చాటున గంజాయి తరలిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్ - హైదరాబాద్ రాజీవ్ రహదారిపై ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీప ప్రాంతమైన రాజమహేంద్రవరం నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచాం అందిందని చెప్పారు. దీంతో ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న బోలేరో వాహనంలో పనస పళ్ల ఉన్నాయి. అనుమానం వచ్చి ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 35 కిలోలకు పైగా గంజాయి బయటపడింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా అందులోని శివ అనే వ్యక్తి పోలీసుల నుంచి జారుకున్నాడు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.8లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పాత నేరస్థులుగా గుర్తించారు.