¡Sorpréndeme!

'మీ పేరుతో వచ్చిన పార్శిల్​లో డ్రగ్స్ ఉన్నాయంటూ' - ఈడీ, ఐటీ ఆఫీస్ సెట్ వేసి మరీ మోసాలు

2024-06-30 144 Dailymotion

Fedex Scams in Telangana : సైబర్‌ కేటుగాళ్లు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 177 రోజుల వ్యవధిలో 592 మంది నుంచి రూ.44కోట్ల 25 లక్షల 93 వేల 497లు కొట్టేశారంటే మాయగాళ్లు ఎంతగా తెగించారో అర్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తికి ఇటీవల ఫెడెక్స్‌ కొరియర్ పేరుతో ఫోన్‌కాల్‌ వచ్చింది. సీబీఐ, ఈడీ పేర్లు చెప్పి ఇల్లు కదలనీయకుండా చేశారు. రోజుల వ్యవధిలో బాధితుడి నుంచి రూ.3కోట్ల 5 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. అతడు తేరుకొని మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగానే. 40లక్షల సొమ్ము అధికారులు ఫ్రీజ్‌ చేయగలిగారు. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే పూర్తి సొమ్ము రికవరీ చేయవచ్చని చెబుతున్నారు.