T20 World Cup Celebrations In Telangana : టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి. పలుప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్ విజయంపై టీమ్ ఇండియాకు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.