¡Sorpréndeme!

తిరిగి అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారు : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

2024-06-28 83 Dailymotion

Cong MLA Rammohan Fires on KCR : తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తాము అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరితేనే విద్యుత్ అవకతవకలపై ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసిందన్నారు. అవినీతి బయట పడుతుందనే ఎల్.నర్సింహా రెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదని ఆరోపించారు. కుమార్తె కవితను కాపాడుకోవడానికి బీజీపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ధ్వజమెత్తారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి, రూ.వేలాది కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.