Tomorrow Ramojirao Memorial Service in Vijayawada: దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సమాజానికి, మీడియా, సినీ రంగాలకు చేసిన విశేష సేవలకుగాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ సభకు సీఎంతోపాటు పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరుకానున్నారు. దాదాపు 7 వేల మంది ఆహ్వానితులు పాల్గొంటారని మంత్రులు తెలిపారు.