¡Sorpréndeme!

తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం - వివాదాస్పదంగా మారిన అసదుద్దీన్‌ నినాదం

2024-06-25 849 Dailymotion

Telangana MP's Took Oath At Lok Sabha : కొత్త లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రమాణాలు ప్రతిధ్వనించాయి. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి, బలరాం నాయక్‌, కడియం కావ్య, సురేశ్​ షెట్కార్‌ తెలుగులో ప్రమాణం చేయగా, వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రతిజ్ఞ చేశారు.

బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ తెలుగులో ప్రమాణం చేయగా, రఘునందన్‌ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇంగ్లీష్‌లో, గోడం నగేశ్​ హిందీలో ప్రమాణం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిబంధనలు పరిశీలించి అసదుద్దీన్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్‌ రాధామోహన్ సింగ్‌ స్పష్టం చేశారు.