¡Sorpréndeme!

పులివెందులలో జగన్​కు నిరసన సెగ

2024-06-25 1,462 Dailymotion

ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలవని జగన్‌ ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గ ప్రజలు, నేతలకు ఆ అవకాశం ఇచ్చారు. ఓటమి బాధలో ఉన్న తనను ఓదార్చి అండగా ఉంటారని ఆశించిన ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. వచ్చిన వారు ఓదార్చడం మాట అటుంచితే తాము చేసిన పనుల పెండింగ్‌ బిల్లుల సంగతేంటని నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. విషయం తేల్చకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరింపులకు దిగడంతో పర్యాటన అర్థాంతరంగా ముగించుకుని బెంగళూరు వెళ్లిపోయారు.