తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆన్‌లైన్ పరీక్షలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. హైదరాబాద్, సైదాబాద్‌లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాల సెంటర్లో పరీక్ష రద్దైంది. ముందస్తు ఏర్పాట్లు చేయకుండా, పరీక్ష జరిగే రోజున కంప్యూటర్లు ఏర్పాటు చేయడంతో, సాంకేతిక కారణాలు తలెత్తాయి. అప్పటికే పరీక్ష సమయం మించిపోవడంతో, ఆ సెంటర్లో పరీక్షను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.