జూలైలో నిర్వహించబోయే గ్రూప్- 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు .