Heavy Rains in Hyderabad : హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం వరకు ఉక్కపోతతో విలవిల్లాడిన ప్రజలకు సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడం వల్ల నగరవాసులకు కొంత ఉపశమనం కల్గింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై వరదనీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, వరదనీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి నీటిని తరలించారు.