Union Budget 2024 Meeting : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో పలు అంశాలను రాష్ట్రం తరపున ప్రస్తావించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల బకాయిలు ఇవ్వడంతో పాటు మరో ఐదేళ్లు కొనసాగించాలని కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రుణ పరిమితి సీలింగ్‌ను బడ్జెట్ సమయంలోనే ఖరారు చేయాలని కోరారు.