Revanth on CM Chandrababu Development : తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్ టూరిజం హబ్లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తుందని అన్నారు. హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.