TG Cabinet Meeting 2024 : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా నిర్ణయించింది. అదేవిధంగా రైతుభరోసా అమలుపై మంత్రివర్గం ఉపసంఘం వేసినట్లు సీఎం స్ఫష్టం చేశారు.