ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ నేడు కొలువుదీరనుంది. 2024 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు ప్రమాణం చేయించనున్నారు. స్పీకర్ పదవికి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి పదవికి కాలవ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.