ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత అమరావతిలోని సచివాలయం బ్లాక్ 2లో బాధ్యతలు స్వీకరించారు. సామాన్య టీచర్‌ను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కూడా బాధ్యతలు చేపట్టారు.