భద్రాద్రి కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీకి చెందిన రాంబాబు, లావణ్య... చిట్టీల డబ్బు, అప్పు తీసుకున్న సొమ్ము, వేర్వేరు కారణాలతో తీసుకున్న డబ్బు అంతా కలిపి సుమారు 12 కోట్ల మేర మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బు తిరిగివ్వాలని అందరూ అడుగుతుంటే స్పందించకుండా ఇప్పుడు ఊరు వదిలి పారిపోయారంటున్నారు. బాధితులంతా కలెక్టర్ అనుదీప్, డీఎస్పీ వెంకటేశ్వర బాబుకు ఫిర్యాదు చేశారు.